కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు సూత్రాల అమలు..ఏ పీసిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రేస్ పార్టీ ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలికిరికి వచ్చిన తులసి రెడ్డికి పీసీసీ సెక్రెటరీ పీలేరు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ కేఎస్ ఆఘా మోహియుధ్ధీన్ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తులసీ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆరు సూత్రాల అమలు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మొదటిది ప్రతి రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీ.రెండవది ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ .మూడవది కడు నిరుపేద కుటుంబాలకు నెలకు 6వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత.నాల్గవ సూత్రం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు. ఐదవ సూత్రం రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేలు కర్తలుగా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీని అందిస్తుందని తెలిపారు. ఆరవ సూత్రముగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలైన కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరం ఒగలార్ధక ప్రాజెక్టు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చేపట్టడం జరుగుతుందని ఈ ఆరు సూత్రాలను అమలు చేస్తుందని కాంగ్రేస్ పార్టీకి అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజానీకానికి తులసీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజానీకం విసిగిపోతున్నారని అన్నారు. నేడు జోడోయాత్రలో రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.దేశంలో బిజేపి కులమతాల చిచ్చు రేపుతుండడంతో కులమత ప్రాంత ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ ఐక్యం చేస్తూ కాంగ్రేస్ పార్టీ అండగా ఉందని తెలుపుతూ రాహుల్ గాంధీ జోడోయాత్ర చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేఎస్ ఆఘా మోహియుద్దీన్,కలికిరి మండల పార్టీ అధ్యక్షులు రహంతుల్లా,ఉపాధ్యక్షులు సలావుద్దీన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు




Comments
Post a Comment