చీటింగ్ చేసి టిప్పర్ ను ఎత్తుకెల్లిన కేసులో నిందితుడు అరెస్ట్
కలికిరి నేస్తం న్యూస్:
చీటింగ్ చేసి టిప్పర్ ను ఎత్తుకెల్లిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపారు.ఎస్ కథనం మేరకు మదనపల్లి పట్టణం సుభాష్ నగర్ రోడ్డుకు చెందిన ఎస్ నరసింహులు కుమారుడు 26 సంవత్సరాల సంపత్ కోట శ్రీకాంత్ @ శ్రీకాంత్ నాయుడు కలికిరి మండలం, గుట్టపాలెం పంచాయతీకి చెందిన కంభం మాధవి ఆమె కుమారుడు రూప్ సాగర్ రెడ్డి వద్ద గత సంవత్సరం మే నెలలో టిప్పర్ వాహనమును 8 లక్షల రూపాయలకు బేరం కుదిరించుకొని, రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు.అయితే మిగిలిన డబ్బులు మదనపల్లి టౌన్ లో ఉన్న మహావీర్ ఫైనాన్సు వారికి నెల నెల ఈఎంఐ లు కట్టి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుంటానని నమ్మబలికి, వాహనమును తీసుకొని వెళ్ళి అప్పటి నుండి ఎలాంటి నెలవారి ఈఎంఐ లు చెల్లించకుండా, ఫోన్ చేసినా స్పందించకుండా, టిప్పర్ ను కనిపించకుండా దాచిపెట్టి ఫిర్యాదిని ఇబ్బందులకు గురి చేయడంతో ఈ నెల 04న కంభం మాధవి ఆమె కుమారుడు రూప్ సాగర్ రెడ్డి లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలికిరి ఎస్ఐ సి.లోకేశ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 8న శనివారం సాయంత్రం 06.30 గంటలకు వాల్మీకిపురం సీఐ బిఎన్ సురేష్ నేతృత్వంలో కలికిరి ఎస్ఐ సి.లోకేశ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ముద్దాయి సంపత్ కోట శ్రీకాంత్ @ శ్రీకాంత్ నాయుడు ను కలికిరి మండలం, కలికిరి-కలకడ రోడ్డులోని మేడికుర్తి క్రాస్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఏపి 21 టిటి 8335 నంబరు గల టిప్పర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితున్ని ఆదివారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ లోకేష్ రెడ్డి తెలిపారు.

Comments
Post a Comment