ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న పీసిసి సెక్రెటరీ కేఎస్ ఆఘా మోహియుద్దీన్

కలికిరి నేస్తం న్యూస్:కర్నూలు పట్టణంలోని పీసీసీ కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలలో పీసీసీ కార్యదర్శి,పీలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేఎస్. అఘా మొహియుద్దీన్ మరియు తిరుపతికి చెందిన పీసీసీ మహిళా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లీలా శ్రీనివాసన్ పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఈ సంధర్భంగా కేఎస్ ఆఘా మోహియుద్దీన్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏఐసిసి పదవికి ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పీసీసీ ఆఫీస్ లో జరుగడం విశేషమని అన్నారు.ఇక్కడ జరిగిన ఏఐసీసీ పదవికి ఏర్పాటుచేసిన భూత్ లో రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.ఏఐసిసి అధ్యక్ష పధవికి ఇద్దరు అభ్యర్థులు మల్లికార్జున ఖర్గే & శశి థరూర్ మధ్య పోటీ నెలకొన్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి డెలిగేట్ సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పీసీసీ సెక్రెటరీ కేఎస్ ఆఘా మోహియుద్దీన్ తెలిపారు.



Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం