కలికిరి గ్రామ పంచాయతీ నూతన ఈఓగా టి.ఉదయ్ కుమార్ భాధ్యతలు స్వీకరణ

కలికిరి నేస్తం న్యూస్:కలికిరి గ్రామపంచాయతీ నూతన ఈఓగా టి.ఉదయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఈయన ప్రస్తుతం వాల్మీకిపురం గ్రామపంచాయతీ ఈఓగా పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించి పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ పనిచేస్తున్న ఈవో బ్రహ్మానంద రెడ్డి ఇటీవల డిప్యుటేషన్ పై గుర్రంకొండ గ్రామపంచాయతీకి వెళ్లగా ఆయన స్థానంలో కలికిరి గ్రామపంచాయతీకి ఇన్చార్జ్ ఈఓగా టి.ఉదయ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఈఓ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కలికిరి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కలికిరి గ్రామపంచాయతీలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి అంటు రోగాలు ప్రభలకుండా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సి.గంగయ్య,సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు





Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం