ఎస్సీ కమీషన్ ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేసిన మాలమహనాడు
కలికిరి నేస్తం న్యూస్:ఎస్సీ కమీషన్ ఆదేశాల పట్ల పీలేరు మండల మాలమహానాడు నాయకులు తమ హర్షం వ్యక్తం చేశారు. పీలేరు పట్టణంలోని మాలమహనాడు కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో మాలమహనాడు నాయకులు మాట్లాడుతూ నవభారత నిర్మాత భారత రాజ్యాంగ హక్కుల ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల స్థాపనకు అధికారుల అనుమతులు అవసరం లేదని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఆదేశాలను ఆయా జిల్లాల అధికారులు సక్రమంగా అమలు చేసే విధంగా మాలమహనాడు కమిటీలు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్,మాలమహనాడు రాయలసీమ జిల్లాల సహాయ కార్యదర్శి నగరిమడుగు సుబాష్,అన్నమయ్య జిల్లా మాలమహనాడు ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు


Comments
Post a Comment