భారీగా ఎర్రచందనం స్వాధీనం..ఇద్దరు తమిళ స్మగ్లర్లు అరెస్ట్

కలికిరి నేస్తం న్యూస్:అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఒక 407,ఒక బొలేరో పికప్ వాహనం,మరియు పల్సర్ ద్విచక్ర వాహనంతో సహా 43లక్షల విలువ చేసే 816 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సంచారదల విభాగ రేంజ్ ఆఫీసర్ ఎన్ వెంకటరమణ తెలిపారు.అందిన సమాచారం మేరకు పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ డి ఎఫ్ ఓ డిఏ కిరణ్ ఆదేశాల మేరకు పీలేరు సంచార విభాగ రేంజ్ ఆఫీసర్ ఎన్ వెంకటరమణ తమ సిబ్బందితో వెళ్లి 2వేరువేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 24 ఎర్రచందనం దుంగలను అదేవిధంగా రెండు వాహనాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ ఎన్ వెంకటరమణ తెలిపారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన రాత్రి 7 గంటల ప్రాంతంలో అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ దిగువ ఎల్లంపల్లి గ్రామ సరిహద్దు లోని తావేటి ఎల్లమ్మ గుడి సమీపంలోని పించా నది దగ్గర టమోటా ట్రేలు మాటున 407 వాహనంలో లోడ్ చేయుచున్న 10 ఎర్రచందనం దుంగలను మరియు పల్సర్ బైక్ వాహనాన్ని స్వాధీనం చేసుకోగా స్మగ్లర్లు పారిపోయినట్లు తెలిపారు.అదేవిధంగా ఈనెల 11న ఉదయం నాలుగు గంటల 45 నిమిషాల ప్రాంతంలో అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కలికిరి నాలుగు రోడ్ల కూడలి నందు వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక అనుమానిత వాహనమును ఆపగా ఆపకుండా శరవేగముగా కందూరు మార్గం వైపున దూసుకొని పోగా ఆ వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు తమ వాహనంతో వెంబడించి కలికిరి పట్టణంలో గల కలికిరి ఎల్లమ్మ దేవాలయం వద్ద అటకాయించి అందులోని ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా వాహనంలో 14 ఎర్రచందనం దుంగలు ఉండడంతో వాహనంతో సహా ఇద్దరు వ్యక్తులను మరియు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కె.అంబు మరియు శరత్ కుమార్ అనే ఇద్దరు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.  వాహనాలతో సహా 24 ఎర్రచందనం దుంగల విలువ 42,07,451 రూపాయలు ఉంటుందని  రేంజ్ ఆఫీసర్ ఎన్ వెంకటరమణ తెలిపారు.ఈ దాడులలో సిబ్బంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.ప్రతాప్, ప్రొటెక్షన్ వాచర్లు దేవేంద్ర, మల్లికార్జున, చరణ్,రవితేజ తదితరులు పాల్గొన్నారు..Publicvibe news link








Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం