ఘనంగా జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిని హోత్రిశ్రీ పుట్టినరోజు వేడుకలు

కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జాతీయ క్రీడాకారిణి హోత్రిశ్రీ పుట్టినరోజు వేడుకలను శనివారం రాత్రి క్రీడాకారుల మధ్య ఘనంగా జరిగాయి. కేకును కోసి అందరికీ పంపిణీ చేసి హోత్రిశ్రీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ హోత్రిశ్రీ  చిన్న వయసులోనే ఆలిండియా స్థాయిలో 10 టైటిల్లు, సౌత్ జోన్ స్థాయిలో 4 టైటిల్లు, రాష్ట్ర స్థాయిలో 12 టైటిల్లు సొంతం చేసుకొని ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు, సీఎం ప్రతిభ అవార్డు పొందడం హర్షనీయమని కొనియాడారు. ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు క్రీడాకారుడు టీ.ప్రభాకర్ రెడ్డి, లావణ్య దంపతులకు అభినందనలు తెలిపారు. హోత్రిశ్రీ వచ్చే నాలుగేళ్లలో ఒలంపిక్స్ లో పాల్గొని మెడల్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోత్రిశ్రీ తల్లిదండ్రులు టి ప్రభాకర్ రెడ్డి, లావణ్య, సీనియర్ క్రీడాకారుడు రాచపల్లి రాజగోపాల్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం