ఉచిత ఎముక పటిత్వ వైద్య శిబిరానికి విశేష స్పందన..డాక్టర్ ఆర్ ఎం హిమబిందు

కలికిరి నేస్తం న్యూస్:ఉచిత ఎముక పటిత్వ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డాక్టర్ ఆర్ ఎం హిమబిందు తెలిపారు.కలికిరి పట్టణం కలికిరి కలకడ మార్గంలోని కపిలేశ్వర హాస్పిటల్స్ నందు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించిన ఉచిత ఎముక పటిత్వ వైద్య శిబిరానికి 350మంది రోగులు రాగా కపిలేశ్వర హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ ఎం హిమబిందు ఎముకల పటిత్వ పరీక్షలు నిర్వహించి 2500 రూపాయలు విలువ గల బి ఎం డి స్కాన్ ను ఉచితంగా చేయడంతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేసి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎం హిమబిందు మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు యాక్సిడెంట్ కు మరియు పాలిట్రామా, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు, కీళ్ల మార్పిడి మరియు వెన్నుముక ఆపరేషన్లు, నడుము నొప్పి, రుమటాలజీ, మోకాళ్ళ సమస్యలకు కీహోల్, కెమెరా ద్వారా సర్జరీలు చేయడం తమ హాస్పిటల్ ప్రత్యేకత అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ విష్ణు శివప్రసాద్ తో పాటు కపిలేశ్వర హాస్పిటల్స్ సిబ్బంది మరియు కూస్తారికా కంపెనీ వెంకటేష్, ఆల్కమ్ కంపెనీ కి చెందిన అరుణ్ మరియు దావూద్ పాల్గొన్నారు..

Publicvibe news link 








Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం