బొబ్బల వ్యాధి పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి..సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:లంపి చర్మ వ్యాధి పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి రైతులను కోరారు.బుధవారం కలికిరి రెడ్డివారిపల్లిలోని ప్రధాన పశు వైద్య కేంద్రం నందు లంపి చర్మ వ్యాధి నివారణకు ఉచిత టీకా కార్యక్రమాన్ని పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకటముని నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేయగా సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంధర్భంగా సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లంపి వ్యాధి పశువులకు అంటు వ్యాధితో సమానమని నివారణ కొరకు ఉచిత టీకాను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.ఈ వైద్య శిబిరంలో సుమారు వంద పశువులకు లంపి వ్యాధి నివారణ టీకాను వేసినట్లు డాక్టర్ వెంకట ముని నాయుడు తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడాడుతూ కలికిరి మండలం లోని పాడి పశువులకు వచ్చే బొబ్బల వ్యాధి నివారణకు టీకాలు ను పశు సంవర్ధక శాఖ సిబ్బంది చేత వేయిస్తున్నట్లు తెలిపారు. 3 నెలలు వయసు గల దూడలను మినహాయించి, మిగిలిన అన్ని పశువులకు వాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన పశువులు చర్మం పైన బొబ్బలు రావడం, పుండ్లు పడడం, తీవ్ర జ్వరం, కాళ్ళ వాపు, పొదుగు వాచడం, ఆహారం తినకుండా చివరకు మరణించే అవకాశం వుందని, దీంతో రైతులకు తీవ్ర ఆర్ధిక నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో పశు వైద్యాధికారి డాక్టర్ అర్షియా, డాక్టర్ గిరినాథరెడ్డి,ఏహెచ్ఎ రాజ్ కుమార్ చలపతి,గోపాలమిత్రలు సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment