రాష్ట్ర అభివృధ్ధి జగన్ కే సాధ్యం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:రాష్ట్ర అభివృధ్ధి జగన్ కే సాధ్యమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కలకడ మండలం కోన గ్రామ పంచాయతీ నందు గడప గడపకు మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.అదేవిధంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా వచ్చిన సమస్యలను అక్కడికక్కడే సంభందిత అధికారులను పిలిచి మాట్లాడి పరిష్కరించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరకం రవికుమార్ రెడ్డి,ఎంపీపీ శ్రీదేవి, మండల కన్వీనర్ కమళాకర్ రెడ్డి, సర్పంచ్ జెల్లా రాజగోపాల్ రెడ్డి, నాయకులు రవికుమార్,ఎంపిడిఓ సీహెచ్ నారాయణ,సచివాలయ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.






Comments
Post a Comment