వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.మూడు రాజధానుల ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి జరిగి తద్వారా ప్రాంతీయ విభేదాలకు చోటు ఉండదని పేర్కొన్నారు.ఆదివారం వాల్మీకిపురం పట్టణ కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్యెల్యే పాల్గొని మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నది ప్రజల అభిప్రాయమని ప్రజాభిప్రాయమే పరమావిధిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ పై ముందుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్రమంతా ఒకే తాటిపై అభివృద్ధి సమానంగా జరగాలంటే మూడు రాజధానుల ఏర్పాటు తప్పదని అన్నారు.ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీ నియోజకవర్గ కేంద్రమైన పీలేరులో వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు. వికేంద్రీకరణను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని ఇందుకు ప్రజలే వారికి తగిన శాస్తి చేస్తారని అన్నారు. ఒక ప్రాంత ప్రజల అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉండడం సోచనీయమని అన్నారు. మంగళవారం ఉదయం పీలేరు పట్టణంలోని జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ ర్యాలీకి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖ ప్రజా ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, వైకాపా కార్యకర్తలు,నాయకులు, పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మాజీ సభ్యులు చింతల శివానందరెడ్డి, సీనియర్ వైకాపా నాయకులు చింతల ఆనందరెడ్డి, నాయకులు, భాస్కర్, శ్రీధర్ రాయల్,కలీం, కాదరి, రవి, రాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు
పబ్లిక్ వైబ్ న్యూస్ లింక్👇


Comments
Post a Comment