బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే జైలు శిక్ష తప్పదు..జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ వి రామకృష్ణ
కలికిరి నేస్తం న్యూస్:బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే జైలు శిక్ష తప్పదని వాల్మీకిపురం జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ వి రామకృష్ణ తెలిపారు.ఆదివారం వాల్మీకిపురం పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి సిహెచ్ వి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు బాల్య వివాహాల నిషేధిత చట్టం పై అవగాహన కల్పించారు.ఈ సంధర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ వి రామకృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధిత చట్టం 2006 ప్రకారం 18 సం. లోపు ఆడపిల్లలకు, 21 సం. లోపు మగ పిల్లలకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్యవివాహానికి అనుమతి ఇచ్చిన, ప్రోత్సహించిన, వివాహాన్ని నిర్వహించిన, జరగటానికి సహకరించిన, బాల్య వివాహానికి హాజరైన వారందరినీ నిందితులు గానే పరిగణించబడతారని తెలిపారు.ఈ నేరానికి 9, 10, 11/1 మరియు 13/10 సెక్షన్ల ప్రకారం గరిష్టంగా 2 సం. జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయని తెలిపారు. ఈ సెక్షన్లకు బెయిల్ కూడా లభించని నేరంగా పరిగనించబడతాయని అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ లైన్ నంబర్ 1098 కు ఫోన్ చేసి తెలపాలని సిహెచ్ వి రామకృష్ణ విద్యార్థినులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏజిపి అశోక్ కుమార్ రెడ్డి,ప్రిన్సిపల్ రమా మంజుల తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment