నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్ కే సాధ్యం..ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:నాడు నేడుతో ప్రయివేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పీలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండవ విడత నాడు నేడు పనులను ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల రూపురేఖలను సమూలంగా మార్పులు చేసి కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత మన రాష్ట్రానికి దక్కిందని అన్నారు.నాడు నేడు మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టి రెండో విడతలో అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలలో చేపట్టారని తెలిపారు. జూనియర్ కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపల్ వై.వెంకటరెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ వై.వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండవ దశ నాడు నేడు పనులకు ఒక కోటి 25 లక్షల 75వేల రూపాయల వ్యయం అంచనాతో టాయిలెట్లు, అదనపు గదులు, డ్రింకింగ్ వాటర్, బోర్, విద్యుత్ పనులు, కలర్ పెయింటింగ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఫుట్ పాతుల నిర్మాణం తదితర పనులు జరగుతాయని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి, ఎంపీపీ కంభం సతీష్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి ఏటి రత్న శేఖర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ, సింగల్ విండో ప్రెసిడెంట్ బీడీ నారాయణరెడ్డి, పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్ రెడ్డి, పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ భాష, వైస్ ఎంపీపీ ఎన్ వి చలపతి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజమ్మ, లక్ష్మీదేవి, మాజీ ఎంపీపీ మహిత ఆనంద్, మండల కోఆప్షన్ సభ్యులు రెడ్డి భాష, ష్టాంపుల మస్తాన్,వైయస్సార్సీపి విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్ అలియాస్ చక్రి, వార్డు సభ్యులు ఆబిద్, నాగభూషణం, వైఎస్ఆర్సిపి మైనారిటీ నాయకులు షాకీర్, మునీర్, షబ్బీర్, మండల ఎంపిటిసి సభ్యులు, వార్డు సభ్యులు, వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.





Comments
Post a Comment