పీలేరు డిపో పరిధిలో అద్దెకు ఖాలీగా ఉన్న రూములు, స్థలాలకు ధరఖాస్తులు ఆహ్వానం..డిపో మేనేజర్ బండ్ల కుమార్
కలికిరి నేస్తం:పీలేరు ఆర్టీసీ డిపో పరిధిలో అద్దెకు ఖాలీగా ఉన్న రూములను, స్థలాలను పొందడానికి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ బండ్ల కుమార్ తెలిపారు. డిపో పరిధిలోని పీలేరు ఆర్టీసీ బస్టాండులో 9 షాపు రూములు, 21 ఓపెన్ స్పేస్ షాపులకు స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.అదే విధంగా కలికిరి ఆర్టీసీ బస్టాండులోని 6షాపులు,కలకడ బస్టాండులోని 4షాపులకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈ షాపు రూములలో బేకరీ, ఫ్యాన్సీ ,కూల్డ్రింక్స్ ,స్వీట్ షాప్స్ ,చాట్ బండార్ ,ఫ్లవర్ స్టాల్ ,షామియానా డెకరేషన్ సప్లయర్స్ ,రెడీమేడ్ గార్మెంట్స్ ,పూలు మరియు పండ్లు, జిరాక్స్ ,ఇంటర్నెట్, ఎగ్ మార్ట్ ,టీ, కాఫీ, స్నాక్స్ కార్నర్స్ తదితర వ్యాపార సముదాయాలను అనుమతి మేరకు అద్దెకు పొందుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్థులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని పీలేరు డిపో మేనేజర్ మేనేజర్ బండ్ల కుమార్ తెలిపారు.ధరఖాస్తు వివరాల కొరకు పీలేరు డిపో మేనేజర్ ను సంప్రదించాలని తెలిపారు.




Comments
Post a Comment