సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికే గడపగడపకు మన ప్రభుత్వం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:సంక్షేమ పథకాలను నిరుపేదలకు ప్రతి ఇంటికి అందించడానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం చేపట్టినట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం పీలేరు పట్టణంలోని కట్టుకాలువ వీధి తదితర ప్రాంతాల్లో ఆయన గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాల గూర్చి వివరించారు.అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పిలిపించి అక్కడికక్కడే సమష్యలను పరిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామపంచాయతీ నందు సచివాలయాలను ఏర్పాటు చేసి అదే విధంగా వాలంటీర్లను నియమించి ప్రతి ఇంటికి నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ఒక వైఎస్ ప్రభుత్వం దేనని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొనియాడారు.సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ షేక్ హబీబ్ భాషా, జడ్పిటిసి ఏటి రత్నశేఖర్ రెడ్డి,కన్వీనర్ దండు జగన్ మోహన్ రెడ్డి,వైస్ ఎంపీపీ ఎన్ వి చలపతి వైఎస్ఆర్సిపి నాయకులు ష్టాంపుల మస్తాన్,తహసీల్దార్ రవి,సచీవాలయ సిబ్బంది,వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు..Publicvibe news link








Comments
Post a Comment