తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్
కలికిరి నేస్తం న్యూస్:తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద రూ.1.79లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా, పీలేరు అర్బన్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు.పీలేరు పట్టణం, చిత్తూరు రోడ్డులో గల రైల్వే గేటు ప్రక్కన ఒక వేప చెట్టు కింద ఉన్న మదనపల్లికి చెందిన సోము అలియాస్ సోమశేఖర్ తిరుపతి జిల్లా, వై.వి పాలెం మండలం గజ్జలవారిపల్లి కి చెందిన యుగంధర్ రెడ్డిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 31 గ్రాముల బంగారు, 450 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన దొంగలలో సోము అలియాస్ సోమశేఖర్ పై పీలేరు, మదనపల్లి, వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 చోరీ కేసులు ఉన్నాయి.పీలేరు సబ్ జైల్లో సోమశేఖర్ కు యుగంధర్ రెడ్డి, బిట్టు ఎల్లప్పలతో పరిచయం ఏర్పడింది. వీరు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడేవారు.బుధవారం పీలేరు పట్టణ శివారు ప్రాంతం, చిత్తూరు మార్గంలోని రైల్వే గేట్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రాయచోటి డిఎస్పి పి.శ్రీధర్ ఆదేశాల మేరకు ముగ్గురు దొగలను సీఐ తమ సిబ్బందితో వెల్లి అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది కాకి విజయ్, అల్తాఫ్, ఆరిఫ్ మరియు వాయల్పాడు పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బందిని రాయచోటి డిఎస్పి పి.శ్రీధర్ అభినందించడమైనది.publicvibe news link



Comments
Post a Comment