స్టార్ లైట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:
పీలేరు పట్టణంలో స్టార్ లైట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి లు శనివారం ప్రారంభించారు. పీలేరు పట్టణం తిరుపతి మార్గంలో అధునాతన మైన స్కానింగ్ సౌకర్యం అందరికి అందుబాటులో ఉండేందుకు డా.కృష్ణ చైతన్య ఏర్పాటుచేసిన స్టార్ లైట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి లు శనివారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పీలేరు పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కమీషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్,ఏపిఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి,జడ్పీ కోఆప్షన్ సభ్యులు షామియానా షఫి,
ఎంపీపీ కంభం సతీష్ కుమార్ రెడ్డి,జడ్పీటీసీ ఏటి రత్న శేఖర్ రెడ్డి,సర్పంచ్ షేక్ హబీబ్ భాష,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్ రెడ్డి, వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరరులు పాల్గొన్నారు.





Comments
Post a Comment