గడప గడపకు మన ప్రభుత్వంతో సమష్యలకు తక్షణ పరిష్కారం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

కలికిరి నేస్తం న్యూస్:  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో గ్రామ సమష్యలకు తక్షణ పరిష్కారం జరుగుతుందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం కలకడ మండలం కోన పంచాయతీ కోన గ్రామం మరియు బంగారువాండ్లపల్లి గ్రామాల్లో  నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని సమష్యల పై ఆరా తీసి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు వందశాతం అమలు జగన్ ప్రభుత్వం కే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో సచీవాలయ వ్యవస్థ,వాలంటీర్ల వ్యవస్థ వలన గ్రామ ప్రజల సమష్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృధ్ధి జగన్ తోనే సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరకం రవికుమార్ రెడ్డి,ఎంపీపీ శ్రీదేవి, జెడ్పిటిసి ఊటుపల్లి హారిక, మండల కన్వీనర్ కమలాకర్ రెడ్డి, సర్పంచ్ జెల్లా రాజగోపాల్ రెడ్డి ,వైసిపి నాయకులు ఇనాయతుల్లా, జయ ప్రకాష్,  బాబు రెడ్డి, కుమార్ రెడ్డి, కస్మూరి  జగన్మోహన్ రెడ్డి, జనార్దన్ నాయుడు,ఎంపిడిఓ సీహెచ్ నారాయణ,ఎంఇఓ మునీంద్ర నాయక్ ,మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు,వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం