రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు విధులు బహిష్కరణ
కలికిరి నేస్తం న్యూస్:రాయలసీమలోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి సోమవారం కోర్టు ఎదుట బైఠాయించి రాయలసీమలో హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని నిరసిస్తూ మూడు రోజులపాటు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. హైకోర్టును కర్నూలు లో ఏర్పాటుచేయడం అందరికి సబబుగా ఉంటుందని అన్నారు.వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధిలో భాగంగా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృధ్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రెడ్డప్ప విభాకర్ రెడ్డి, చంద్ర, లక్ష్మీ నరసింహయ్య, ద్వారకనాథరెడ్డి,మోడెం రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment