ఫాల్కన్ వ్యాలీ స్కూల్ నిర్మాణ ప్రక్రియపై ఏపీ ఎస్ఎంఎ సమీక్ష

 కలికిరి నేస్తం న్యూస్:ఫాల్కన్ వ్యాలీ స్కూల్ నిర్మాణ శంకుస్థాపనల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ సున్నీ మసాయిక్ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డ్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ షా జకావుద్దీన్ హుస్సైనీ నేతృత్వంలో కలకడ మండల కేంద్రంలోనూ అదే విధంగా చిత్తూరులోనూ బోర్డు సభ్యులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షులు మాజీ ఆర్టిఏ కమీషనర్ మరియు పిసిసి సెక్రెటరీ కె ఎస్ అఘామోహియుద్దీన్ నేతృత్వంలో చేపట్టే నిర్మాణాల ప్రక్రియపై చర్చించారు.ఈ సందర్భంగా మొదట పాఠశాలను కలకడ పట్టణంలో తాత్కాలికంగా ప్రారంభించడానికి కమిటీ సభ్యులు సూచించిన కొన్ని ప్రదేశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏపీ ఎస్ఎంబి అధ్యక్షులు జకావుద్దీన్ హుస్సైనీ మాట్లాడుతూ కలకడలో తాత్కాలికంగా పాఠశాలను ప్రారంభించి నిర్వహణ జరుపుతూ స్కూల్ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతంలోకి పాఠశాలను మార్పు చేయడానికి కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.ఫాల్కన్ వ్యాలీ స్కూల్ నందు కుల మత ప్రాంత ధనిక పేద అనే తేడా లేకుండా ఇంటర్నేషనల్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఆఘా మోహయుద్దీన్, సయ్యద్ అబ్దుల్ రహమాన్,రాయచోటి మహబూబ్ బాషా,సయ్యద్ జకీ,పీలేరు మస్తాన్,కలకడ కమిటీ సభ్యులు మహమ్మద్ ఇర్షాద్, షేక్ జిలాని, కరీముల్లా, మస్తాన్, షేక్. జమాల్, షేక్ నిజాముద్దీన్, అతావుల్లా సర్ఫరాజ్, అల్తాఫ్, అజీజ్, కలకడ మండల సభ్యులు పాల్గొన్నారు.

పబ్లిక్ వైబ్ న్యూస్ కొరకు క్రింద 👇లింక్ క్లిక్ చేయండి

                  Publicvibe news link 







Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం