ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పీలేరు తాలూకా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవం
కలికిరి నేస్తం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పీలేరు తాలూకా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఎలక్షన్ ఆఫీసర్లు గా ఆ సంఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి జి.గురుప్రసాద్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా సుధాకర్ రాజు, అబ్జర్వర్ గా గాజుల రమేష్ లు వ్యవహరించారు. ఈ ఎన్నికలకు ముఖ్యఅతిథిగా ఆ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వై. శ్రీనివాసరెడ్డి పాల్గొని ఎన్నికలు నిర్వహించగా పీలేరు తాలూకా ప్రెసిడెంట్ గా కేవిపల్లి మండలం గర్నిమిట్ట పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ ఎ.పురుషోత్తం, కార్యదర్శిగా సీనియర్ అకౌంటెంట్ రెడ్డి శేఖర్, కోశాధికారిగా ట్రెజరీ శాఖ అధికారి జి.జయరాం, అసోసియేట్ ప్రెసిడెంట్ గా హెల్త్ సూపర్ వైజర్ ఎం.కుసుమకుమారి, వైస్ ప్రెసిడెంట్ లు గా పి.సుబ్రత్ , ఎస్ మస్తాన్,యు.శ్రావణి,ఎం. నాగరాజు నాయక్, టి.విద్యాసాగర్,టి.సుకుమార్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు గా ఎ.మైథిలి, కె.జయచంద్ర, బి.శాంత, డి.హరిబాబు,కృష్ణయ్య వి.స్వర్ణలత, ఎస్.హాసన్ భాషా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు




Comments
Post a Comment