సచీవాలయం-3లో ఘనంగా దసరా వేడుకలు
కలికిరి నేస్తం న్యూస్:కలికిరి పట్టణంలోని సచీవాలయం-3నందు శుక్రవారం దసరా ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉద్యోగులు నిర్వహించారు. సచీవాలయాన్ని పూలతో అలంకరించారు. సచీవాలయంలో అమ్మవారికి కార్యాలయ ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదే విధంగా ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించారు.ఈ దసరా ఉత్సవాలకు సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గాదేవి అమ్మవారికి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

Comments
Post a Comment