రెండు వేర్వేరు దాడుల్లో 19లీటర్ల సారా స్వాధీనం..ఇద్దరు సారా విక్రేతలు అరెస్ట్

 కలికిరి నేస్తం న్యూస్:

పీలేరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 19 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని సారాను కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఈబి సీఐ వై గురు ప్రసాద్ తెలిపారు.సోమవారం పీలేరు మండలం పీలేరు పట్టణంలోని ఎర్రంరెడ్డి గుట్ట మరియు ఇందిరమ్మ కాలనీలో పీలేరు ఎస్ఈబి పోలీసులు దాడులు నిర్వహించగా ఎర్రంరెడ్డి గుట్టలో బి.అక్కులమ్మ 9 లీటర్ల సారాను కలిగి ఉండగా అరెస్ట్ చేసి,అనంతరం ఇందిరమ్మ కాలనీ లో దాడులు చేయగా కే.లక్ష్మయ్య  10 లీటర్ల సారాను కలిగి ఉండగా దాడి చేసి పట్టుకుని అరెస్టు చేసి ఇరువురిని రిమాండుకు తరలించినట్లు ఎస్ఈబి సీఐ వై.గురుప్రసాద్ తెలిపారు. ఈ దాడులలో  ఎస్ఈబి ఎస్ఐ లక్ష్మీ నరసయ్య, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ యోగానంద, పీసీ లు,  సుధాకర్, సురేష్, రేఖ తదితరులు పాల్గొన్నారు




Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం