వాహనంతో సహా 10 లక్షలు విలువ చేసే తొమ్మిది ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కలికిరి నేస్తం న్యూస్: వాహనంతో సహా 10 లక్షలు విలువ చేసే తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణ తెలిపారు. అందిన సమాచారం మేరకు పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ పరిధిలోని కలికిరి మండలం కలికిరి నుంచి సోమల కు వెళ్లే మార్గంలో కమాల్ పల్లికి వెళ్లే రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి క్వాలిస్ వాహనాన్ని అటకాయించగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని వదిలి డ్రైవర్ మబ్బులో పారిపోగా వాహనంలో ఉన్న 284 కిలోల ఎర్రచందనం ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణ తెలిపారు ఈ దాడులలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె. ప్రతాప్, ప్రొటెక్షన్ వాచర్లు చరణ్, దేవేంద్ర పాల్గొన్నారు




Comments
Post a Comment