సచివాలయం-1ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపిడిఓ
కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో గల సచివాలయం-1ని ఎంపీడీఓ సి. గంగయ్య గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఆయా పరిధిలోని వివరాలను నోటీస్ బోర్డులో అతికించారా లేదా అని ఆరా తీశారు.సమస్యలపై సచివాలయం కు వచ్చిన సమస్యల గురించి ఆరా తీసి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అదేవిధంగా గ్రీవెన్స్ సమయంలో తప్పనిసరిగా సచివాలయంలో అందరూ ఉండాలని అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు




Comments
Post a Comment